ఎడబాటు
ఎడబాటు తీరబోతోందన్న భావాన్ని
తడబడుతూ కూడా
ఎంతందంగా చెప్పగలదా నది.
********
సీమంతం
తన మీది చిటారు కొమ్మకు సీమంతమంటూ
ఎండుటాకుల శుభలేఖలొదిలెనా మాను అడవి సెలయేటిలో
అందుకున్నదే తడవు ఆ ఏరు
అడవి మానుల గడపలెల్ల వదిలెనాలేఖ
లేఖనంది సంతసమొంద ప్రతి మాను
తన గూటిలోనే గువ్వలనాయింటి పెరంటానికంప
గువ్వలంత ఆ మానింట ఎన్ని దీవెనలిచ్చిరమ్మ
ఫక్కుమని నవ్వ కొమ్మ ఎన్ని చివురులు తొడిగెనమ్మ.
********
కనువిప్పు
ఎవరికో కనువిప్పు కలగాలని
తీగలను చుట్టుకుని మరీ
ఒంటిని దాచుకుంటుందా మొక్క
ఎవరికైఉంటుందంటావ్?
*******
మనసు రూపం
ఆ తామరాకు మీది నీటిబొట్లను
చుక్కలుగా కలుపుతూ రంగవల్లిని
రచిద్దామనుకుంటున్నావేమిటోయ్
ఎపుడైనా ఓ సారి ప్రయత్నించు
నీ మనసే రూపంలో ఉంటుందో
నీ కళ్ళకు కనబడకుంటే నన్నడుగు.
*******
చాలా విభిన్నంగా వుందండి మీ సీమంతం కవిత.మిగతావి కూడా అర్థవంతంగా వున్నాయి.
ReplyDeletethank you ravisekhar garu
Deletechakkaga unnai, keep writing.
ReplyDeleteramesh garu all are very very nice
ReplyDeletethank you veena garu
DeleteIts different mode poetry.Kudos
ReplyDeletethank you padmarpitha
Delete