Tuesday, July 31, 2012

మోహార్ణవం

మోహార్ణవం 
కన్నుల హాలాహలపుధారలు గారుచుండ 
ఎపుడో అమృత బిందువొకటి 
నా హృదయమున కందునని అహర్నిశమూ 
నీ మోహార్ణవమును చిలుకుచుంటినాడ.
*********
వెతల మైదానం 
ఆగక పారే కన్నీళ్ళతో 
అనుభవాలెన్నో పండించే వెతల మైదానం 
నా హృదయం.
*********
అద్దం 
ఎన్నెన్నో వ్యాపకాలతో 
క్షణం తీరిక లేకుండా గడుపుతూ కూడా 
నేను ఎదురుపడగానే నవ్వుతూ 
నన్నెలా పలకరిస్తుందో చూడా అద్దం .
**********
అభినయం 
కరిగానని 
కరిగించ లేకపోయానని 
రెంటినీ ఒకేలా అభినయిస్తూ 
కంటినెరుపెక్కించడమే తెలుసు 
నా మనసుకి.
********

2 comments:

  1. అద్దం చాలా బావుందండి.మన మనసు కూడా అంత స్వచ్చంగా ఉండాలండి.

    ReplyDelete