గోపికలు
తెల్ల వారుతూనే
చల్లనమ్మబోయే గోపికలు ఆ పచ్చికలు
వారితో ఆడుతూ ఆ చల్లను
మాయం చేసే కృష్ణుడు ఆ సూరీడు .
*******
మూడు కాలాలు
ఆ కొండకు పట్టిన స్వేదాన్ని
వదిలించేలా స్నానం చేయించి
దుప్పటి కప్పి నిద్రబుచ్చడానికే
ఈ మూడు కాలాలున్నది.
********
శూన్యాలంకరణ
తాను శోభించడానికి శూన్యాలంకరణ చాలని
ఓ పక్క చెబుతూనే లెక్కకు మించిన
ఆశలపై మోజు పడడం
ఆ మనసుకే చెల్లింది.
*******
రూపాంతరం
వికాసాల లేత చేతులకు
ఆ అనుభవాల వేళ్ళు
అందించలేనంతగా
రూపాంతరం చెందాయా అనురాగాలు.
*******
చాలా చాలా బాగున్నయి రమేష్ గారు....:)
ReplyDeleteమూడవది ఇంకా బాగుంది.
seetha garu thank you
Deletethank sai garu
ReplyDeletegood, keep writing.
ReplyDeletethank you bhaskar garu
Delete