Wednesday, July 11, 2012

స్పందన

స్పందన 
సింధువైనా  బిందువుతో మొదలైనట్లు 
అనంత జ్ఞాన సాగరమంతా 
చిన్న స్పందన నుండే ..........
*********
నాగరికత 
కట్టింది విప్పేసి చరిత్రని 
నాగరికతగా మలచింది 
ఆమె.
********
భావాలు 
పనికిరాని విత్తులు పైకి తేలుతుంటే 
పనికిరాని భావాలెందుకు 
అంత లోతుగా నాటుకుంటాయి 
మనసుల్లో.
********
పబ్బులు 
రాతిరికి చీకటికి మధ్య సంబంధాన్ని 
వెక్కిరిస్తున్నాయి 
ఆ పబ్బుల్లో దీపాలు.
********
 మృత్యువు
మన వైపుకు దారి చేసుకుంటూ 
వచ్చే గమ్యమే 
మృత్యువు .
********

9 comments:

  1. పనికిరాని విత్తులు పైకి తేలుతుంటే
    పనికిరాని భావాలెందుకు
    అంత లోతుగా నాటుకుంటాయి
    మనసుల్లో.
    chaalaa bhagunnai,
    keep writing.

    ReplyDelete
  2. ఎప్పటిలాగానే మీ style లో చాలా బాగారాసారు...

    ReplyDelete
  3. నాగరికత బాగుంది :)

    ReplyDelete
    Replies
    1. phani garu welcome to my blog and thank you very much

      Delete
  4. మీ "భావాలు"
    బాగున్నాయి...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. నా భావాలను అర్ధం చేసుకున్న మీ భావాలకు ధన్యవాదాలు

      Delete
  5. స్పందన,భావాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి.

    ReplyDelete
  6. రవి శేఖర్ గారు నా భావాలు మీరు అర్ధం చేసుకున్నందుకు మీ స్పందనకు ధన్యవాదాలు

    ReplyDelete