ఒయ్యారం
ఒయ్యరమెక్కువా సెలయేటికని
తానెంత ఒయ్యారంగా మారి దానికి
ఆతిథ్య మిస్తోందో చూడా కొండ.
*******
చెప్పగలవా?
ఆట లోంచి పాట పుడుతుందా?
పాటలోంచి ఆట పుడుతుందా?
చెప్పగలవేమిటోయ్?
గాలి వీచే వేళ ఆ పంట చేనును చూస్తూ.
********
అందమైన స్వార్ధం
ఓ పక్క ఇతరుల సొమ్ము లాక్కుంటూనే
ఇంకో పక్క తనకంత స్వార్ధం లేదని
గొప్పలు చెప్పుకోవడానికి కాకపోతే
తన కిందా చీకటికీ ఆశ్రయమెందుకిస్తుందా దీపం.
*********
జలపాతం
తనను సృజియించిన మేఘాలను స్మరిస్తూ
మరలా వాటికి రూపమిద్దామని కాబోలు
జారుతున్న ప్రతిసారి తుషారాన్ని అలా
గాలిలోకి సాగనంపేదా జలపాతం.
*********
వాల్జడ
జీవితం లో ఎంతో ఎత్తుకు
ఎదిగిపోవాలన్న నిజం ఎలా తెలిసిందబ్బా
ఆ ఆడాళ్ళ వాల్జడలకు.
********
చక్కగా రాశారండి.
ReplyDeleteరమేష్ గారూ..
ReplyDeleteభలే ఉన్నాయి :)
జలపాతం చాలా బాగుందండి .
Deletethank you seethagaru.
Deletebaagunnayi ramesh gaaroo!
ReplyDelete@sri
thank you very very much sree garu
Deleteyour blog design is excellent.
ReplyDeletethank you very much ravi sekar garu
ReplyDelete