వర్షరాగం
అందుకోలేని ఆ కొండ తాపాన్ని
ఆగలేని ఆ మేఘపు విరహాన్ని
ఒక్కతాటన కట్టేదే
ఈ వర్షరాగం.
******
జాణ
నీకై ఎదురుచూచు నా మనోసీమలందు
నా రెప్పలనే తోరణాలుగా అలంకరింపచేసితివి
ఔరా! నీవెంత జాణవు?
*********
వలపు గాయము
మౌనాన
మరింత శోభింతుమని ఎరిగే
మూగవైనవి
వలపు గాయమ్ములన్నీ.
********
రాత్రి
ఆమె ఇంకా
నా స్వప్నసీమలనేలుతూనే ఉందని
పగటి అందాలను
వద్దనుకుందీ రాత్రి.
********
ఆమె ఇంకా
ReplyDeleteనా స్వప్నసీమలనేలుతూనే ఉందని
పగటి అందాలను
వద్దనుకుందీ రాత్రి.
chaalaa chkkaga undi, feeling.
వర్ష రాగం చాలా బాగుంది రమేష్ గారు.
ReplyDeletethank you very much revisekhar garu.
Delete