Friday, July 13, 2012

బ్రతుకు దారులు

బ్రతుకు దారులు 
వాడిపోయిన పూలే కాదు
వికసించాల్సిన మొగ్గలు కూడా రాదారులపై
 బ్రతుకుదారులు వెదుక్కుంటున్నాయి.
********
చేవ్రాలు 
కరగబోతున్న తమ అందాలు 
నాకు చేరాలని మెరుపు తీగలతో 
చేవ్రాలు చేస్తున్నాయా మేఘాలు.
********
దీపం 
ఎన్ని చీకట్లు కమ్ముకుంటేనేం నా జీవితాన 
నా హృదిలో ఇంకా 
దీపం శ్వాసిస్తూనే ఉంది.
******
కాలం 
అందరి జీవితాలు 
వడ్డించిన విస్తర్లే 
కానీ మనసుపడి 
కొందరి విస్తర్లలో కొన్నిటిని 
ఆరగిస్తుందీ కాలం.
******
 

6 comments:

  1. చాలా బాగున్నాయండి ....

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సీత గారు.

      Delete
  2. బాగున్నాయండి మీ చిట్టికవితలు

    ReplyDelete