హోలీ
తెలుపు, ఎరుపు, బంగరు వర్ణాల మోములపై
మందారపు వర్ణాలు అలుముతుంటే
ఆ కారుమేఘపు వన్నె వాడి నవ్వులు
చూస్తూ ఆ వివిధ వర్ణాల విరులు ఆనందబాష్పాలు రాల్చుతుంటే
పుడమి గుండెనంటిన ఈ రంగుల సాక్షిగా
పాపం నోరు తెరఛి ఆ హోలీ
ఒక్క రోజైనా సెలవు అడగలేకుందా బృందావనాన.
********
ప్రేమ
అమ్మ చేతి వటపత్రాన తేలి
ఆలి చేత తులసాకున తూగె
ప్రేమెంత తేలిక చేసిందోయ్
ఆ కృష్ణుణ్ణి.
******
పబ్
తళుకుమనే దీపాలా తారలు
లేజర్ కాంతులా మెరుపు తీగలు
అడ్డొచ్చే మబ్బులన్నీ మనసుని మత్తెక్కిస్తుంటే
ఒళ్ళు మరచి నా ప్రియురాలు, ఆ నిండు జాబిలితో
వెన్నెల్లో నా మనసు చిందులేస్తుంటే .....
అవునోయ్ ఆకాశం నుండే ఊడిపడింది నాకని ఓ పబ్
మరి నీకో.........?
*********
మనసు
పూవు మనసునా పరిమళం
జలపాతపు మనసునా తుషారం అనువదిస్తున్నట్లు
జాబిలి మనసును ఊగుతూ ఆ చెరువు అలలు.....
********
4 diamonds ...shining a lot ...
ReplyDeletenice ramesh garu :)
thank you very very much sita gaaru
Deleteఅమ్మ చేతి వటపత్రాన తేలి
ReplyDeleteఆలి చేత తులసాకున తూగె
ప్రేమెంత తేలిక చేసిందోయ్
ఆ కృష్ణుణ్ణి....
chaalaa baagundi...@sri