విలువలు
మనిషిని మేల్కొల్పీ మేల్కొల్పీ విసుగెత్తి
ఆఖరికి ఆ పుస్తకాల్లో చేరి
విశ్రాంతి తీసుకుంటున్నాయా విలువలు.
********
ఆనందబాష్పాలు
లోకమంతా పరచుకున్న
ఆహ్లాదాన్ని చూస్తూ ఆకులన్నీ
ఆనందబాష్పాలు రాలుస్తున్నాయి
ఈ పొగమంచు వేళ.
********
భావగీతం
పంట చేల మీదుగా
వినిపించే ఆ గోదారి పాడే భావగీతమే
నా జీవితం.
********
కట్టు బానిసలు
కొందరి వికాసాలకు
ఇంకొందరి చెమట చుక్కలు
కొందరి వినోదాలకు
ఇంకొకరి కన్నీటి బొట్లు
కట్టు బానిసలు.
********
వానచినుకు
వీడొచ్చిన ఆకాశాన్ని
కడసారి చూడడానికని
ఒళ్ళంతా కళ్ళుచేసుకుని
నీటి బుడగ అవతారమెత్తింది
ఆ వానచినుకు.
*******
ప్రతి పదం అందంగా చెక్కి వదిలారండి.చాలా బాగున్నాయి.
ReplyDeletethank you ravi sekhar garu
Deletenice poems.
ReplyDeleteముత్యాల కవితాగుళికెల మాలలెన్నో...
ReplyDeleteమీరు మది నుండి జాలువార...
మేము చదివి ఆనందించ...:-)
అభినందనలు.
'విలువలు' తెలుసుకొని 'వానచినుకు' లో తడిసి 'కట్టుబానిసత్వం' తెంచుకొని 'భావగీతం' లో మునుగి 'ఆనందభాష్పాల'లో ని ఆనందం లా ఉంది.
ReplyDeleteసూపర్..:-)
thank you very very much
Delete