Thursday, July 12, 2012

చుంబనం

చుంబనం 
తాకీ తాకని ప్రియుని చుంబనంతో 
ఆ ప్రేయసికి పట్టిన  స్వేదబిందువుల్లా లేవూ 
మేఘాల చుంబనంతో ఆ కొండపై 
ఆకు చివర్లనుండి జారుతున్న నీటిబిందువులు.
విందు 
కొండంత పీటేసుకు కూర్చుని 
గోదారంత విస్తట్లో 
నిండు జాబిలి వడ్డిస్తున్న 
విందారగిస్తోంది నా మనసు.
*******
మాటల సేతువు 
మాటల సేతువుపై ఎపుడో గానీ 
చేయి చేయి పట్టి 
నడవడం లేదా మనసు, నాలుకలు.
********
కాపురం 
ఊయలలో ఊగే బిడ్డను 
కందామని కాబోలు ఊయలూగుతూనే 
కాపురం చేస్తున్నారా కలువ, జాబిలులు
వారి కలలు అలలై ఊరు ఈ తటాకాన.
********
 

5 comments:

  1. చుంబనం చాలా బాగుంది.ఇలాంటి కవితలు వ్రాయాలంటే మీకు మీరే సాటి.

    ReplyDelete