ఆనంద బాష్పం
పారవశ్యాన నా నెచ్చెలి కంటి నుండి జారిన
ఒక్క ఆనందబాష్పాన్ని
కోటి మణుగుల మేలిమి ముత్యాలు ధారవోసి
కొన్నదా కడలి
తన నెచ్చెలి, ఆ గోదారి ముక్కుపుడకన పొదగడానికి.
********
జయకేతనం
పుట్టుక చావు నడుమ జీవితం
అనే మూడు వర్ణాలతో
నా జాతీయ పతాకం కన్నా
ఉన్నతంగా ఎగురుతోందా లంచపు జయకేతనం
నా ఈ దేశాన.
********
రాతిరి
అన్ని దీపాలను పోగేసి
అలా వెలిగించడానికి
పగలంత సమయం పట్టింది
ఈ రాతిరికి.
******
కన్నీళ్లు
పుట్టిన నాడు
పెదవులపై పూచిన నవ్వులను
కడుగుతున్నాయి
పోయిన నాటి కన్నీళ్లు.
*******
బాగున్నాయండీ..:)
ReplyDeletethank you seetha garu.
Delete1&3 i am unable to understand, may it need some more clarity,i think.
ReplyDeleteidi chinna soochana mathrame, emanukokandi, it may be perfect in your view. thank you.
Bhaskar garu once imagine them then you can understand thank you.
Deletethank you very much raya garu
ReplyDelete