చెరువు
వెన్నెల్లో తాను తేలుతూ
ఆ జాబిలిని ఎంత చక్కగా మోస్తుందో
చూడా చెరువు.
*******
ఇంద్రధనుస్సు
పూలకు వర్ణాలు పంచీ పంచీ
అలసిపోయి ఎపుడో గాని
అలా బయటకు రాదా ఇంద్రధనుస్సు.
********
పలకరింపు
రావడం తోనే అందరినీ
పలకరించడమెలాగో
ఈ చెరువింటికొచ్చిన
ఆ రాయిని చూసి నేర్చుకోవాలి.
*******
అద్దం
మింగడం చేతకాక
అన్నిటిని పట్టి వదిలేస్తుంది గానీ
అమ్మో! నోరంటూ ఉంటేనా
ఆ అద్దానికి ........
*******
addam atikinattundi :)
ReplyDeletethank you very much seetha garu.
Deleteevi hykula andi, konni ala kanipisthunnai, konni mini kavithala unnai, division unte bhavvuntundemo,
ReplyDeletenice ones, keep writing.
ఇవి మినీ కవితలేనండి మీరు సూచించినట్లు హైకులు పబ్లిష్ చేసినపుడు తప్పకుండా mention చేస్తాను and thank you very much.
Deletenice...baagunnaayi annee..
ReplyDelete@sri
sri garu thank you very much
Delete