మాతృభాష
జీవితదశల్లా
మాతృభాష ఇప్పుడు
వృద్ధాప్యం లోకి వచ్చిందోయ్
అందుకే పరాయి పంచన ఓ మూల
తన నెలవు వెతుక్కుంటోంది.
********
రోడ్డు
కొందరి జీవితాల్లో
బాల్యం, ముసలితనాలకు
చిరునామా ఆ రోడ్డు.
*******
నీవు
ముక్కలైన ఆ మెరుపు తీగన
వెలుగు నిలిచినట్లు
గాయమైన నా హృదయాన
నీవట్లే నిలుతువు.
*******
హృదయం
వేణువూదు గానము అంత ప్రీతి నీకని
ఏల చెప్పనైతివి నాకు
నిలువెల్లా గాయాలతో విరబూయింతును గదా
నా హృదయాన్ని.
********
chakkaga unnai andi.
ReplyDeletethank you bhaskar garu
Deleteహృదయాన్ని తాకాయండీ....:)
ReplyDeleteసీత గారు అంత లోతుగా ఆలోచించ గలిగిన మీ హృదయానికి ధన్యవాదాలు.
Deleteభలే రాస్తారు మీరు
ReplyDeleteచిన్ని పదాల్లో ఎన్నో భావాలు.
పద్మార్పిత గారు ఆ చిన్ని పదాల్లోని భావాలను అర్ధం చేసుకుని మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు
Deleteబాగున్నాయండి ! బాగా రాసారు
ReplyDeleteవంశీకృష్ణ గారు ముందుగా నా బ్లాగ్ కు స్వాగతం మరియు మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteచాలా బాగా వ్రాసారు. అభినందనలు.
ReplyDeleteముందుగా నా బ్లాగ్ కు స్వాగతం మీ బ్లాగ్స్ అన్నీ చూసాను కానీ మీ పేరు నేను గమనించలేక పోయాను. ఏమైనప్పటికీ నా రచన పై మీ స్పందనకు చాలా చాలా ధన్యవాదాలు.
Delete