అలజడి
తన అందం చూసుకోవడానికి
నా చెక్కిలి అద్దాలను కన్నీటితో
మెరిపిస్తూనే ఉంటుందా అలజడి.
*********
వర్ణాలు
జీవితాల్లోకి
ఎన్ని వర్ణాలొచ్చాయో
వివర్ణం చేయడానికి
ఆ మనసుని.
******
కబుర్లపోగు
తాను కబుర్లపోగుననిపించుకునేలా
ఊసులెన్నో చెప్పాలని
పాదాల మొదలా శిరస్సు దాకా ఎంతందంగా
ఆ మాను మేనల్లుకుందో
చూడీ తీగ.
********
శ్రీగంధం
గాలి సాయంతో
ఆ మాను నీడను అరగదీసి
తన మేనుకు శ్రీగంధంలా పూసుకుంటుంది
ఈ పుడమి.
********
chaalaa baagunnayi kavithalu. oke kavithagaa raayandi nkaabaaguntaayi
ReplyDeleteరమేష్ గారూ, కవితా భావాన్ని మొదట ఆరు లైన్లుగా తర్వాత ఎనిమిది ఇలా పెంచుకుంటూ పోండి.
ReplyDeleteచక్కని భావ కవిత్వం వస్తుంది. మీ భావాలు చాల చక్కగా ఉన్నాయి కానీ అవి విడిపోయినట్లుగా అనిపిస్తాయి.
అన్యదా బావించకండి, మీకు సలహా ఇస్తున్నందుకు....మెరాజ్
మీ స్పందనకు అభిమానానికి సలహాకు ధన్యవాదాలు త్వరలోనే మీరు చెప్పినట్లు ఒకటే కవితగా నా భావాలను తెలిపే ప్రయత్నం చేస్తాను.
Deleteమీ కవితా ఝరి బావుంది. మీ భావావేశాన్ని చక్కగా వ్యక్తీకరించారు. మీ బ్లాగ్ రూపం కూడా.. చాలా బాగుంది.
ReplyDeleteవనజ గారు ముందుగా నా బ్లాగ్ కు స్వాగతం మరియు మీ స్పందనకు ధన్యవాదాలు
ReplyDelete