అద్దం
నవమాసాలు మోయకుండా
కాస్తంతైనా పురుటినొప్పులు పడకుండానే
నవరసాలొలికించే నన్నెన్నిసార్లు ప్రసవించిందో
నా ఇంటి అద్దం.
******
స్వేచ్ఛ
స్వేచ్ఛ అంటే ఏమిటని అడిగితే
తన రెక్కకు నా రెప్పను
బంధీని చేసిందేమిటో ఆ పిట్ట.
********
నీడ
వెలుగు ఔదార్యాన్ని
చీకటి స్వార్ధాన్ని
ఏక కాలంలో చూపగలదు
నా నీడ.
******
విజయం
సాగరమంత
శ్రమే కాదా విజయం కోరుకునేది
స్వాతిముత్యమంత
ఓరిమిని కూడా.
*******
addam chaalaa baagundi, vijayam nijaanni teluputhundi ramesh gaaru kavithalu baagunnaayi.
ReplyDeletefathima gaaru dhanyavaadaalu
DeleteADDAM CHAALAA BAAGUNDI RAMESH GAAROO!..ABHINANDNALU...@SRI
ReplyDeletesri garu dhanyavaadaalu
Deleteనీడ,విజయం చాలా బాగున్నాయి.
ReplyDeleteravi sekhar garu dhanyavaadaalu
Delete