Sunday, September 16, 2012

తూరుపు తీరుపు

తూరుపు తీరుపు 
ఈ మంచుతో ఆహ్లాదంగా అల్లుకున్న 
తమ అనుబంధాన్ని ఓర్వలేకపోతున్న 
ఆ తూరుపు తీరుపును కన్నీళ్ళతో 
శిరసా వహిస్తున్నాయా ఆకులు.
*******
అతివృష్టి 
అతివృష్టి లోనూ 
ఆకాశం దాకా ఎదిగే పంట 
మన విషాదమేనోయ్.
********
మానవత 
మానవత 
ముందుకు నడవాలంటే 
తరాలు వెన్నక్కి నడవాల్సిందే.
**********
గజ్జె 
నవజీవనహేలతో నర్తించే 
ఈ పుడమి చరణాలా నదులకు 
అప్పుడప్పుడు గజ్జె కడుతుందా ఆకాశం.
********

6 comments:

  1. చాలా బాగున్నాయి రమేష్ గారు!ముఖ్యంగా మానవత

    ReplyDelete
  2. manchi teerupu thoorupu isthundi mee bhaavukatha chaalaa baagundi chirujallulaa

    ReplyDelete
  3. నాలుగూ నాకు నచ్చాయి.

    ReplyDelete