సంఘర్షణ
నిజానికి శాంతి కన్నా
సంఘర్షణేనోయ్
ఎక్కువ వికాసం
నేర్పిందీ మనుషులకి.
******
అన్వేషణ
వెలుగుతూ
ఆ చీకటి శిరస్సుకై
వెదుకుతుంటే ఆ దీపం
దాని కింద నలుగుతూ
ఆ దీపపు చరణాలకై
అన్వేషిస్తుందా చీకటి.
*******
అలక
అలిగి ముఖం చాటేయడం కంటే
కోపంతో నా మేనంతా విరుచుకు పడితే
ఎంత బావుణ్నీ వెన్నెల
అంటుందా పుడమి.
*******
నక్షత్రాలు
అకాశానికా మిణుగురులు
అంకితమిచ్చిన దీపాలే
నక్షత్రాలు.
*********
మీ అక్షర కుసుమాలన్నీ చదివానండీ...చాలా బాగున్నాయి..మనఃపూర్వక అభినందనలు రమేష్ గారు..
ReplyDeleteవర్మగారు మీ స్పందనకు ధన్యవాదాలు.
ReplyDelete