క్రోధం-మోదం
మనసుల నుండి
ఎప్పటి మకరందాన్ని అప్పుడే తాగేసే
భ్రమరమీ క్రోధం
కూడబెట్టే మధుపమీ మోదం.
*******
సంద్రం
అంత సంపద తనలో ఉంది గనుకే
ఈ రేయింబవళ్ళనా సంధ్యకిచ్చి
పూటకోసారి పెళ్ళిచేసి
తన చేతులమీదుగా
నవ్వుతూ సాగనంపగలదా సంద్రం.
*******
మనశ్శాంతి
నేనెన్ని శివధనస్సులు
విరవాల్సివస్తుందో
నన్ను వరించాడానికా మనశ్శాంతి.
*******
స్వప్న సుందరి
మనసులను మురిపించేంత ప్రతిభ
తనలో ఉంచుకుని కూడా
తన ప్రదర్శనకు ఒక్క శ్రోత గానీ
ఒక్క ప్రేక్షకుడు గానీ
వద్దంటుందేమిటా స్వప్నసుందరి.
*********
expressions are good.
ReplyDeleteyohanth garu welcome to my blog and thanks for your comment
Deleteమీ చిట్టి కవితలు మనసునకు ఇంపుగా వున్నాయి.
ReplyDeleteravisekhar garu thank you
Deleteఎన్ని శివధనిస్సులు విరవాల్సి వస్తుందో.. బాగున్నాయండీ..రవి గారన్నట్టు మీ చిట్టి కవితలు ఇంపుగా ఉంటున్నాయ్.
ReplyDeletesubha garu dhanyavaadaalu.
Delete