Wednesday, September 26, 2012

లంచం

లంచం 
ఒడి నుండి ఆ చావులమడి దాకా 
ఎంత పచ్చగా తన బ్రతుకు పండించుకుంటోందో 
చూడా లంచం.
*******
ఉపనయనం 
ఎప్పుడో గానీ బిడ్డలపై ప్రేమను కురిపించని 
ఆ తండ్రిని కాదని అన్నీ తానేఅయి 
ఆ మానుకి ఈ తీగను జంధ్యంగా వేసి 
ఎంతందంగా ఉపనయనం చేస్తుందీ నేల తల్లి.
********
మధువు 
నన్నా భానుడు భయపెట్టేవేళ 
పువ్వులా ఈ నేలపై విరిసిన 
ఆ చెట్టునీడ గర్భాన 
గుప్తంగా దాగిన మధువు!
నా నీడ.
********
నవ వధువు 
ఆ వరునింటే వడిగట్టు బియ్యాన్ని 
అప్పగిస్తానని ఇంద్రధనుస్సు గడప దాటి 
పుట్టింటి నుండి మెట్టినింటికి చేరిన 
నవవధువా వానచినుకు.
********

2 comments:

  1. చాల బాగా రాసారండి...especially నవ వధువు....వాన చినుకు :)

    ReplyDelete
  2. కావ్య గారు నా బ్లాగ్ కి స్వాగతం మరియు మీ స్పందనకు ధన్యవాదాలు :-)

    ReplyDelete