వలపు ఏరువాక
ఏడు అడుగులు నడిచాయో లేదో
అపుడే వలపు ఏరువాకకు ఎంతందంగా
ప్రణాళికను రచిస్తున్నాయో చూడా చేలో
ఆ వానచినుకులీ మన్నుతో మమేకమై.
*********
శిశిరోదయం
మోడైన ఆ ఎదలను చిగురింప చేయాలని
తన వంతుగా
ఆ గాలెంత శ్రావ్యంగా సంగీతమాలపిస్తోందో
చూడా రాలిన ఆకులతో కలిసి
ఆ శిశిరోద్యానవనాన.
ఆ శిశిరోద్యానవనాన.
********
సింగారం
అసలు సిసలు సింగారాన్ని
నా వదనానికి నేర్పేవి
పెదవులే.
*******
ప్రగతి తేరు
అవినీతి, అధిక ధరలు
సామాన్యుని ప్రగతి తేరుకు చక్రాలు
నా దేశాన.
*******
No comments:
Post a Comment