వారందగత్తెలు
వారి కనుసన్నలలో అనంత సౌందర్య సాగరపుటలలెగసిపడుతున్నవి
వారి ఎదల మాటున సురతో, సరితూగగలుగు ఝరులూరుతున్నవి
ఈ లోకాన మైత్రీ మధురగంధాన్ని పూయగలరు వారు
కాంక్షా విభావరీ గీతికలనాలపించగలరు వారు
డోలలూగుతూనే, ఆనందహేలా ధనుస్సులను చేబూని
గురిచూసి మదిన నాటగలరు వారు
ఆహ్లాదమను సుమనశ్సరమ్ములు
వారింద్రధనుస్సులను పెదవులపై శ్రుతించి
ఆ పిలుపులతో అందరి మదినేలెడి ప్రాభావమ్మున్నవారు
విలాసాహాసిత చుంబన ప్రబంధాలనెన్నో
గాలివాటున రాయగల ప్రాజ్ఞులైయుండి కూడా
వారిపుడు మరులుగొని చేరెనో చెలీ నా చెంత
నీ వాల్జడన కొలువు గోరి.
********
పూల పరిమళాలను మాపై వెదజల్లారు.చాలా బాగుంది.
ReplyDeletethank you ravisekhar garu
Deleteసుగంధ సుమం పరిమళ భరితం.
ReplyDeletedhanyavaadaalu
Deleteబాగుందండి.
ReplyDeletethanks bhaskar garu
Delete