ఆ! రైతునే
కరుణించమంటూ అదేపనిగా ఆ ఆకాశాన్ని
తన ఆశల పుప్పొళ్ళు చల్లుతూ అర్ధించే
ఎడారిని కాను నేను
పొంగిపొర్లుతూ మీదికొచ్చిపడిన యవ్వనసౌందర్యం తో
ఆ మింటికి కనుగీటే నదినీ కాను నేను
వద్దనుకోవడం రాక, ఆ నింగి లోతుల్లో వెదుకుతూ
అనేకానేక ఇంద్రధనూ రాశులను పండించే
నా పగిలిన సులోచనాల మాటుగా
జోడు జీవనదులే ప్రవహిస్తున్నా!
హసించే ఎడారొకటి వసించే మనసుతో నిలబడిన
నేనెవ్వరో గురుతు పట్టగలవా నువ్వు
ఆ! అవును బక్కచిక్కిన నీదు దేశ భాగ్య విధాతను
రైతును.
***********
ramesh garu very nice
ReplyDeletethank you veena garu
Deleteచక్కగా రాశారండి, అభినందనలు.
ReplyDeletebhaskar garu dhanyavaadaalu
Deleteఎవరో మహానుభావుడు అన్నాడు "మనం జీవితంలో ఒక్కసారి డాక్టర్, లాయరు మరియు పోలీసు అవసరం ఉంటుంది, కాని ప్రతి రోజు మూడు పూటలా ఒక రైతు అవసరం ఉంటుంది.". కానీ ఈ దేశంలో రైతు పరిస్థితి మరీ దయనీయంగా తయారయింది.
ReplyDeleteశ్రీనివాసరావు గారు ముందుగా నా బ్లాగ్ కు స్వాగతం మీ ఆలోచనలు పంచుకున్నదుకు ధన్యవాదాలు
Deletemost neglected person,,
ReplyDeleteMost unfortunate profession
People struggle every minute for his product
yet they don't even acknowledge his presence
thanks for sharing your ideas
Deleteరమేష్ గారూ, పైన పెట్టిన వ్యాఖ ఎవరో తెలీదు కాని ఎంత సత్యముందో, నిజమే ప్రతి నిమిషం కష్టపడుతూ పలితం దక్కని ఒకే ఒక పని వ్యవసాయం
ReplyDeleteఅది ఉద్యోగమూ కాదు ,వ్యాపారమూ కాదు, అంత విలువైన పనికి ఇంత చులకన మన దేశంలో.. అందుకే పల్లెలు వెలవెల పోతున్నాయి. చక్కటి కవిత
నా సూచన విన్న మీకు ధన్యవాదాలు. ఇప్పుడు చూడండి ఒకే భావన ఎంత బాగుందో. మీరు చక్కగా రాస్తున్నారు అన్ని కవితలూ ...మెరాజ్
ఫాతిమా గారు మీ సలహాకు, స్పందనకు, అభిమానానికి ధన్యవాదాలు
Deleteనా పగిలిన సులోచనాల మాటుగా
ReplyDeleteజోడు జీవనదులే ప్రవహిస్తున్నా
ఎంత ఆర్ద్రమయిన వాక్యం.వాస్తవ పరిస్థితిని కళ్ళకు కట్టారు.రైతుకు తన పంటపై ఏ గ్యారంటీ లేదు.గాలివాటు జీవితం
ravisekhar garu dhanyavaadaalu
Delete