Tuesday, August 28, 2012

బోసి నవ్వులు

బోసి నవ్వులు 
వసంతపుర రాజధానీ సౌధాలకు 
వర్ణాలలద్దుతున్నాయి 
ఆ పసోడి బోసినవ్వులు.
*******
అడవి సెలయేరు  
సాయంసంధ్యలో గూటికి చేరి 
ఆ మానుకు పిట్టకథలు చెప్పే 
పక్షుల శృతిలో తన ఊహలను 
పాటలుగా పాడుకుంటూ 
సాగుతుందా అడవి సెలయేరు.
*********
విరహం  
అనేకానేక గుప్త భాగ్యరాసుల్లాటి అనుభవాలతో 
నా హృదయాన్ని 
క్షణానికో దీవిగా మార్చే సంద్రం 
నీ విరహం.
******
చీకటి 
తన హృదయాన్ని పట్టుకోగలిగే 
మెళకువనొక్కటి నేర్పక 
ఆ వెలిగే దీపానికి,
రాతిరికి లోకాన్నేలగలుగుతుంది 
ఈ చీకటి.
*******
కుచేలుడు 
బీడువడిన గుండెతో పిలిస్తే 
తన ఇంటికొచ్చిన ఆ ఆకాశానికి 
కుచేలుడిచ్చిన అటుకుల్లా 
అంత పరిమళాన్ని మాత్రమే 
అద్దుతుందీ పుడమి.
*******

2 comments:

  1. రమేష్ గారూ, చిన్న మనవి కవితలు అన్నీ బాగున్నాయి.
    కానే వేరు,వేరు భావాల కవితలు కనుక ఓ పూల గుచ్చంలా చూడలేము.
    వీలైతే ఒకే భావనని ఓ పోస్ట్ లో పెట్టండి. అన్యదా బావించవద్దు. మీ కవితలు చాలా బాగున్నాయి...మెరాజ్

    ReplyDelete
  2. ఫాతిమా గారు నా కవితలన్నీ చదివినందుకు నచ్చినందుకు ధన్యవాదాలు. మీ సలహా బాగుంది అలా చేయడానికి ప్రయత్నిస్తాను.నావన్నీ మినీ కవితలు కావడం వల్ల ఇలా ఒకే పోస్ట్ లో 4 లేదా 5 కవితలు పోస్ట్ చేస్తున్నాను.

    ReplyDelete