Tuesday, August 14, 2012

నాలుగు రాళ్ళు

నాలుగు రాళ్ళు
నాలుగురాళ్ళు 
వెనకేసుకోమనా పెద్దలంటే 
ఏకంగా నాలుగు కొండలనే 
వెనకేసుకున్నాడా నేత.
*******
శంఖం  
ఏ దూర తీరాలను చేరినా
పుట్టింటి పలుకులనే వల్లెవేసే 
ఆ శంఖాన్ని చూసి 
ఏమి నేర్చుకోవాలంటావ్ 
ఈ ఎగిరెళ్ళే యువతరం.
********
రాగాలాపన 
తన గొంతు పిసుకుతున్నా 
నీ శ్వాస సీమలో 
తన మనసుతో ఎన్నెన్ని 
రాగాలాలపించగలదా పువ్వు.
*******
వీలునామా 
తన ఒయ్యారపు వీలునామా 
చెల్లుబాటు కావడానికి 
ఆ ఆకాశపు చేవ్రాలు కోసం 
ఎదురుచూస్తుందా గోదారి.
*******

4 comments:

  1. all are very very nice వీలునామా కవిత చాలా అందంగా ఉంది అభినందనలు

    ReplyDelete
  2. రాగాలాపన...వీలునామా...
    చాలా బాగున్నాయి
    రమేష్ గారూ!...@శ్రీ

    ReplyDelete