Thursday, August 9, 2012

సంధ్యా చెక్కిళ్ళు

సంధ్యా చెక్కిళ్ళు 
తీరని తన అలకలన్నీ అనుమానపు తీగలై అల్లుకున్న వేళ
ఆమె మనసు, కంటి నుండి ఏకధారగా గారుచుండ
మెరయుచున్న ఆ ముదిత చెక్కిళ్ళ అద్దాన
మోదమొందుచు తన రూపు సవరించుకొనియె ఆ మాధవుండు
అపుడామె మోము విరిసిన ఎర్రకలువ
అపుడామె మనసు అమాసను వరించిన పున్నమి వెన్నెల చెలియ
ఇక అక్కడి మౌనమోపలేక ఆ కాలం
ఆరు ఋతువుల అందాలను దూసి
ఆ బృందావనాన రాశిగ బోసి
మచ్చికైన వారి మనసుల నడుమ
ఆ అనురాగామెంతసేపు ఎడమైయుండునటంచు
వారి కనుదోయిల నడుమ తోరణమై నిలచె
అపుడు జారుతున్న ఆమె కన్నీటి బిందువులనొక్కొక్క కొనగోట నిలిపి
ఓ బేల ఇన్ని గోవర్ధనాల నెటుల మోయగలిగితివీవు
నీ మనసు పరిధి దాటి ఊహనైనా పోని నాకై అంటూ సరస వచనంబులాడ
అపుడా అనుమానపు తీగలపై అనురాగపు విరులు నవ్వె
మనసులు కలసిన మకరందాన్ని కాలానికి రువ్వె
ఇపుడూ! ఆ రాధ మోము విరబూసిన ఎర్రకలువేనోయ్
కాకపోతే ఆ ఎరుపు ఏ సంధ్యా ఒప్పనిది
ఈ ఎరుపు ఏ సంధ్యా విడువనిది.
***********

8 comments:

  1. చాలా బాగుంది.....

    కృష్ణాష్టమి శుభాకాంక్షలు..

    ReplyDelete
    Replies
    1. thank you very much meeku kuda krishnaashtami subhaakaankshalu

      Delete
  2. అందమైన శీర్షిక దానికి తగిన కవిత అబినందనలు

    ReplyDelete
  3. విభిన్న మైన ప్రయత్నం తో కొత్త ప్రయోగం చేసారు.మంచి పదాల కూర్పు.

    ReplyDelete