ఆంగ్లపు తేరు
పనికిరానివనిపించుకుని
ఈ తోట నోటా పూల సహజ పరిమళాలు
అగరాబత్తులై వెలుగుతున్నాయి
ఊరేగే ఆ ఆంగ్లపు తేరుపై.
*********
తల్లి
ఆ పసివాడి పూర్ణచంద్ర హాసిత మోముపై
రెండు నెలవంకల విల్లెక్కుపెట్టి మరీ గురిచూసి
ఎన్ని ముత్యాల సరాలను సాధించిందో చూడా తల్లి
సరస చుంబనాల పరిష్వంగాన.
***********
అతిథులు
సంపదతో వెలిగిపోతున్నప్పుడు
అతిథులెందరో వస్తారని విన్నానుగానీ
మరా అమాశ నిశిలో ఏమిటోయ్
అంతమంది అతిథులొచ్చారా ఆ ఆకాశపుటింటికి.
*********
నా హృదయం
బద్దలై ఇన్ని అందాలుగా
పరిణమించిన విశ్వాన్ని చూసి
నీ విరహాన బీడై కూడా
ఇన్ని అందాలనూహించడం నేర్చింది
నా హృదయం.
*******
రమేష్ గారూ, మీ భావాలు చాలా అందంగా చెప్పారు.
ReplyDeleteముఖ్యంగా " తల్లి " కవితలో. మీ బ్లాగ్ మొత్తం చదవాలి ఓ రోజు...మెరాజ్
మెరాజ్ ఫాతిమా గారు మీ స్పందనకు ధన్యవాదాలు
Deleteఅతిధులు చాలా బాగుందండి.మిగతావి కూడా
ReplyDeleteravisekhar garu dhanyavaadaalu
Delete