నారుమడి
సర్దుకుని సర్దుకుని పెరిగి ఆపై
ఎదిగేందుకు ఇంత చోటు చూపిన
ఆ పంట చేలో ఎలా సమ్మోహనంగా
పరుగెడుతోందో చూడా నారుమడి.
********
జాబిలి
అందాల నిండు జాబిలిని
అద్దాన పట్టి కొంటెగా దానికి
కను ముక్కు చెవులు గీచేంతలో
నవ్వుతున్న నీవగుపించావేమిటి ఈ అద్దాన!
ఓ నా చెలీ.
*********
వేణువు
ఓనమాలు నేర్చుకుంటానని
లోపలికొచ్చి సంగీత సారస్వతాన్నంతా
నేర్చుకుని బయటకెళ్తున్న గాలిని
మనసారా దీవిస్తుందా వేణువు.
**********
విత్తు
ఆకాశానికి పుడమికి కూడా
తనలోని భావ చిత్రకారున్ని చూపిస్తూ
ఎదుగుతుందా విత్తు.
********
అలంకారం
ఏపుగా ఎదిగిన పంట చేనుకు
కడలి అలల
అలంకారమద్దుతుందా గాలి.
**********
అద్దాన పట్టి కొంటెగా దానికి
కను ముక్కు చెవులు గీచేంతలో
నవ్వుతున్న నీవగుపించావేమిటి ఈ అద్దాన!
ఓ నా చెలీ.
*********
వేణువు
ఓనమాలు నేర్చుకుంటానని
లోపలికొచ్చి సంగీత సారస్వతాన్నంతా
నేర్చుకుని బయటకెళ్తున్న గాలిని
మనసారా దీవిస్తుందా వేణువు.
**********
విత్తు
ఆకాశానికి పుడమికి కూడా
తనలోని భావ చిత్రకారున్ని చూపిస్తూ
ఎదుగుతుందా విత్తు.
********
అలంకారం
ఏపుగా ఎదిగిన పంట చేనుకు
కడలి అలల
అలంకారమద్దుతుందా గాలి.
**********
బాగున్నాయండీ..!!:-)
ReplyDeletethank you very much seetha garu
Deleteఏమని పొగిడెదను..:-)
ReplyDelete:-) :-) thankyou
Deleteవేణువు చాలా బాగుంది.
ReplyDeletedanyavaadaalu ravi sekhar garu
Delete