జ్ఞాపకం
నాకు నీడనిచ్చిన జ్ఞాపకాన్ని
నాతో పాటూ బూడిదౌతూ
గురుతు తెచ్చుకుందా మాను.
*********
స్తన్యం
వట్టిపోయిందని చెలి తన ఎదను చూపితే
అరుస్తూ రోదిస్తూ ఆకాశం నుండి
ఆ ప్రియుడు దిగొచ్చాడంతే
ఇక చూడామె ఎన్ని మొలకలకి
తన స్తన్యాన్ని పడుతోందో.
*********
నల్లని పుష్పం
ముడుచుకోవడం వికసించడం తప్ప
వాడడం అంటే ఏమిటో తనకు తెలీదంటూ
నేలకు మాత్రమే తన పరిమళాన్ని పంచే
నల్లని పుష్పమే నా నీడ.
********
మానవత
నాగరికతెంత వికసించినా
అంటరాని తనాన్ని
వదిలించుకోలేక పోయిందెందుకో
ఈ మానవత.
********
పబ్
మిణుగురుల్లాటి మసక దీపాల కింద
గుడ్లగూబలంత వికారంగా
మన సంస్కృతిని తక్రిందులు చేసిన
గబ్బిలాలు కొన్ని మత్తులో
చిందులేస్తున్నాయా పబ్బులో.
*********
పదాల అల్లిక , వాటిల్లో దాగున్న భావం చక్కగా ఉన్నయండి , అభినందనలు
ReplyDelete-- కళ్యాణ్
kalyan garu welcome to my blog and thank you very much for your comment
Deletebaavunnayi
ReplyDelete