మధురానుభూతులు
మరచిపోలేని మధురానుభూతులెన్నో
తన మగడి చెవిన వేయాలన్న ఆత్రమోవేపు లాగుతుంటే
అంతలోనే ఆ ఊసులన్నీ విని వాడేమనుకుంటాడోనన్న
బిడియమింకోవైపు లాగుతుంటే
ఆనందంలో అనుమానాన్ని కలుపుకుని
సుడులు తిరుగుతూ ఎంతందంగా సాగిపోతోందో
చూడా గోదారి.
********
ఏడడుగులు
ఆకాశం కురిపించే
ప్రేమధారకు కరిగి
ఏడడుగులు వేస్తుందా మన్ను
అదిగో అలా.......
*******
గుండెచప్పుళ్ళు
గుప్పెడు అక్షరాలు చాలు
నా గుండెచప్పుళ్ళనీ దిగంతాలలో
ప్రతిధ్వనింపచేయడానికి.
*********
ఆణిముత్యాలు
పడినా లేచినా
ఆగక నవ్వే ఆ కడలి అంతరంగంలో
ఆణిముత్యాలు కాక ఇంకేమిటుంటాయోయ్.
********
baagunnayi madhuraanubhutulu:-)
ReplyDeletethank you padma garu :-)
Deleteఆణిముత్యాలు...ఆణిముత్యమే..
ReplyDeleteబాగుంది రమేష్ గారూ!
@శ్రీ
ధన్యవాదాలు శ్రీ గారు
ReplyDelete