Friday, April 5, 2013

మనసైన బానిసత్వం

మనసైన బానిసత్వం 
నోరు తెరిచి అడగ్గానే స్వాతంత్ర్యమిచ్చి 
ఆకాశాన్ని తన పాలు చేసిందని కాబోలు 
ఎంత ఎదిగితే అంత గట్టి సంకెళ్ళను 
తనకు తానే తయారు చేసుకుని 
ఈ మట్టితో బానిసత్వమూ 
తనకిష్టమేనని అంటుంది ఆ విత్తు. 
*******
మెరుపు తీగ
తనను  తాను మీటుకోవడం వల్లనే 
ఇన్ని అందాలొచ్చాయీ పుడమికని 
ఎంత అతిశయాన్ని ప్రదర్శిస్తుందో 
చూడా మెరుపుతీగ. 
*******
పండుటాకులు 
ఓ పూట ఆకలి తీర్చిన ఎండుటాకులు 
గర్వంతో అలా  ఎగిరి పడుతుంటే 
ఇన్నేళ్ళ ఆకలి తీర్చిన పండుటాకులు కొన్ని 
వీధి చివర క్రుంగిపోతున్నాయి విదల్చబడి. 
**********
గురువు 
ఏటికి గొంతిచ్చి 
లెక్క లేనన్ని పైరు పాపలకు 
పాటలు నేర్పే గురువును చేసింది వాన. 
*******

2 comments:

  1. తనకు తానే తయారు చేసుకుని
    ఈ మట్టితో బానిసత్వమూ
    తనకిష్టమేనని అంటుంది......chaala nachindandi

    ReplyDelete