కాంతిహారం
రాతిరికలా నింగి లో అన్ని పూలు పూసి
వాడిపోవాల్సిందేనేమిటోయ్? ఎంచక్కా నాలా
ఆ సాలెగూటి తీగలను పేని దారంగా చేసి
ఆ పూలతో కాంతిహారమల్లడం నేర్పు నీ ఊహలకి.
*******
కరగబోతున్న అందాలు
కరగబోతున్న తమ అందాలు
నాకు చేరాలని మెరుపు తీగలతో
చేవ్రాలు చేస్తున్నాయా మేఘాలు.
*********
కొమ్మ
కొమ్మ ఒకటి ఒయ్యారంగా
నలుగురిలోకి నడచి వచ్చి
తనపైని ఆకులను పూవులను రాల్చుకుంటూ
మళ్ళీ అంతే ఒయ్యారంగా నడిచెళ్లిపోయింది
ఫ్లాష్ లైట్ల వెలుగులో.
*******
స్పందన
సింధువైనా బిందువుతో మొదలైనట్లు
అనంత జ్ఞానసాగరమంతా
చిన్న స్పందన నుండే.........
********
No comments:
Post a Comment