చేను
శ్రావ్యమైన సంగీతమైందో లేదో
ఆ గీతానికెంతటి
కమనీయ రుపునాపాదిస్తోందో
చూడా చేను.
*******
వాగు
పొంగుతూ! తాను పాడుతున్న
వాన పాటను, ఒళ్లంతా చెవులు చేసుకుని
వింటున్న ఆ మాను పాదాలను కడుగుతూ
సాగుతుందా వాగు.
*******
పూల
తెల్లవారే వేళ తమపై
మంచు బొట్లను మోస్తూ కొమ్మే కాదు!
తాము కూడా, పూలను
పూయించగలమంటున్నాయా పూలు!
*******
మనసు
నీలో తానున్నానని
కన్నీటిలో పడి కొట్టుకుపోతూ
చెబుతుందేమిటోయ్ నీ మనసు.
********
బ్లాగ్మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు
ఉగాది శుభాకాంక్షలు.
ReplyDeletedhanyavaadamulu
ReplyDelete