బిరుదు
పుట్టిన నాటి నుండి! కవిత్వాన్ని
కొంగున ముడేసుకుని తిరుగుతున్నా
ఏ ఒక్క బిరుదూ ఇవ్వవేమిటోయ్ నువ్వు
ఆ అలలకు.
*********
మార్గదర్శకత్వం
అనంత ఐశ్వర్యం తనలో ఉన్నా
తనకంటూ ఓ హద్దు కావాలనుకుని
తీరాన్ని ముద్దిడే కడలే
మార్గదర్శకత్వం చేయలేకపోతోంది
అనంతానంత అనుభూతులను
ఆనందబాష్పాలుగా రెప్పల జారుతున్న ఈ వేళ
నాదు మనసు.
*********
లోకకళ్యాణం
లోకకళ్యాణమన్నది ఎప్పటికీ
రేపటి మాటేనోయ్!
ఎందుకంటే ఆ విలువలతో ఏడడుగులు వేయడం
నేటికీ నువ్ నేర్వలేదుగా మరి.
********
కారుణ్యం
కన్నీళ్ళకు కారుణ్యాలు మొలిస్తే
మనిషికి బదులు
పాపమా దేవుడు ఒంటరివాడైపోతాడేమో కదూ.
*********
బాగా రాశారు
ReplyDeletewelcome to the blog and thank you very much
Deleteఇన్ని భావాలను చెప్పుకోవటానికి ఇంత మంచి భాష ను కూర్చిన ఆ అక్షరాలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం.
ReplyDelete:-) thank you very much
Delete