మేజువాణి
నవ్వే నీ పెదవికి తెలుసు
నిన్నెంతలా కవ్వించిందో నా మనసని
మోడును కానంటూ విరబూసిన నా హృదయానికి తెలుసు
నాలోని మౌనాలను పాటలుగా ఎలా వసంతించిందో నీ మనసని
అలలెగసి పడే సంద్రంలా
అలలెగసి పడే సంద్రంలా
నీ ఆలోచనలతో నిండిన నాదు అంతరంగానికి తెలుసు
నీవు కాని అనుభూతి నా అనుభవానికి రాదనీ, నా మనసుకు అవధి వీవని
మబ్బుల తేరులపై ఆగుతూ సాగుతున్న నా చూపులకు తెలుసు
గగనమంతటి నీ వలపు తోటన తేటులై తామాడే ఆటన
హరివిల్లులెన్ని విరిశాయో, విరజాజులెన్ని కురిశాయో! పుడమిన అణువణువునూ పలకరించే కిరణాలకు తెలుసు
మబ్బుల తేరులపై ఆగుతూ సాగుతున్న నా చూపులకు తెలుసు
గగనమంతటి నీ వలపు తోటన తేటులై తామాడే ఆటన
హరివిల్లులెన్ని విరిశాయో, విరజాజులెన్ని కురిశాయో! పుడమిన అణువణువునూ పలకరించే కిరణాలకు తెలుసు
నీ, నా సంగమ సంకేత నికేతనం
ఎగురనిచోటు యుగాలు మారినా వాటికి కానరాదని
ఆగక సాగుతూనే ఉంటుంది మన మానసవీణల మేజువాణి అని
. **********
No comments:
Post a Comment