మనసుఆకలి
చెరువంత విస్తరిలో
కొసరి కొసరి వెన్నెల వడ్డించే ఆ జాబిలింట
విందందుకున్నావేమిటోయ్ ఎపుడైనా
అన్నానని కాదుగానీ అప్పుడప్పుడూ మనసు ఆకలి కూడా తీర్చాలోయ్
ఏమంటావ్?
*******
ఏకాంతశిల్పి
నన్నానందింపజేయడానికి నా ఏకాంత శిల్పి
నిన్ను చెక్కి నా మనసు నింపి
తానెక్కడికో వెళ్ళిపోయాడు.
********
పిలవని పేరంటం
తలుపులన్నీ మూసేసినా
పిలవని పేరంటానికి
ఎంత దర్జాగా వచ్చిందో చూడా చీకటి.
******
మెరుపు సుందరి
చీకటిలోనూ ఆ మబ్బుల గుంపుల్లో
దారి చేసుకుంటూ ఎక్కడికి పోతోందో
ఆ మెరుపుసుందరి.
******
తలుపులన్నీ మూసేసినా
ReplyDeleteపిలవని పేరంటానికి
ఎంత దర్జాగా వచ్చిందో చూడా చీకటి.
నాకు బాగానచ్చిందండి.
thank you very much
Delete