ముక్కుపుడక
తావిని మోయలేకా గాలికి పట్టిన
స్వేదబిందువొకటి జారి
ఆ పువ్వుకు ముక్కుపుడకైంది అదిగో అలా ....
*******
ప్రకృతి
జీవిత ప్రాంగణంలో
మనిషి వేగంగా పరుగెత్తడం
మొదలెట్టిన చోటే ఆగిపోయింది
అసలు ప్రకృతి.
********
తోడు
సుఖదుఃఖాలను చెప్పుకోవడానికి
ఆ రాదారికి కూడా
కుడిఎడమల మానులున్నాయి
కానీ బ్రతుకు రాదారిపై నీకో ....?
********
మగత
తానెవరిని మత్తెక్కించాలని
మగతగా అడుగుతుందా నిద్ర
పబ్బుల వెంట తిరుగుతూ.
********
ఒకటి రెండు అద్భతంగా ఉన్నాయి
ReplyDeleteమూడవది చెళ్ళు మనిపించేలా ఉంది
మీ ప్రతి కవిత నాకు బాగా నచ్చుతాయి ధన్యవాదములు
vanaja garu thank you very much
Deleteబాగున్నాయ్ రమేష్ గారు,..
ReplyDeletechakkagaa vunnayi mi chinni kavitalu eppati laane
Deletemanju garu thank you very much
Deletebhaskar garu thank you very much
Delete