బిడియం
దాటనా? వద్దా? అంటూ బిడియపడుతూ
నీ పెదవిని దాటేసి, నాకెంత
గాయంచేసి కూర్చుందో చూడు
ఆ నీ చిరునవ్వు.
********
వసంతం
నల్లది పిలిస్తే వచ్చిన పచ్చది
తెల్లని నా కంటిని ఎరుపెక్కించి బహుమతిగా
నాలుగు ఆనందబాష్పాలు రాల్చుకుంది
ఈ తోటలో.
********
రాయికీ మనసు....
నా మెడలో చేరిన పూలహారంతో
అందరూ నన్ను మొక్కేరు. నన్ను నిలిపిన నా దేవుణ్ణి
నే మొక్కలేక పోతున్నానంటూ వాపోతోందా శిల్పం.
రాయికీ మనసుందోయ్.
*******
పచ్చని వలువ
తామిచ్చే చిరుస్పర్శకే పులకరించిపోయే
ఆ ప్రేమికుని మేనిపై
పచ్చని వలువ నేయాలని
ఆ మేఘాలు గిరిని కప్పుతున్నాయి.
********
nice andi anni
ReplyDeletemanju garu dhanyavaadaalu
Deleteచాలా చాలా బాగున్నాయి ..రాయికీ మనసు....super
ReplyDeletesathya garu welcome to my blog and thank you very much
Delete