అందాలవిందు
అద్దంలాటి మనసు , ఆతిథ్యమీయాలన్న ఆశ!
ఈ రెండూ చాలవా? ఆకాశం కూడా మురిసిపోయేంత
అందాలవిందును ఆ నిండు జాబిలికి వడ్డించ నేనంటూ
చూడు ఎలా మిడిసిపడుతోందో అందాల ఈ పల్లెచెరువు.
*********
అందమైన అలజడి
నాలుగు రాళ్ళను లోనికేసుకుంటూ!
అలజడిలో కూడా అందముంటుందంటుందా చెరువు
నిజమేనంటావా?
*******
కొంగ
పుల్లంత కాళ్ళతో ఇంతటి దేహాన్ని ఎలా మోసుకొస్తున్నావంటూ
తనను వెక్కిరించేలోపే ఇంతిల్లున్నా
దాక్కోవడమే రాని నిన్ను నా గొంతులో దాస్తానంటూ
గుటుక్కున చేపను మింగిందా కొంగ.
********
నీ కన్నులంటే ......
నాపై ప్రేమను చెప్పే నీ పెదవులకన్నా
మౌనంగా నీ ప్రేమను తెలిపే
నీ కన్నులే నాకిష్టం.
*******
నాపై ప్రేమను చెప్పే నీ పెదవులకన్నా
ReplyDeleteమౌనంగా నీ ప్రేమను తెలిపే
నీ కన్నులే నాకిష్టం. nice
thank you very much
Deleteఅందాలవిందు...అందంగా ఉంది
ReplyDeletethank you very much
Delete