Thursday, November 8, 2012

జీవన వసంతం

జీవన వసంతం 
బరువంతా దింపుకున్నాక గానీ సాక్షాత్కారించలేదు 
వసంతమనే స్వప్నమా మానులకైనా.
మరి నీవేమిటోయ్ ?
మోయలేనంత బరువుని నీ మనసుకెత్తి 
అలా ఆరాటపడతావు ఆ  జీవనవసంతానికై.
*********
పున్నమి  
విరిసిన ఆమె మనసు పొరలన్నిటి మీద 
అచ్చమైన మనసుతో 
వాడు చేవ్రాలు చేసిన ప్రతివేళ 
పున్నమే.
*******
నిండు మనసు 
పైకెదగమంటూ 
నిజమైన నిండు మనసుతో 
అక్షతలు చల్లడం 
ఆ ఆకాశానికి తప్ప ఇంకెవరికొచ్చు.
*******
పూజ 
తాను పోగొట్టుకున్న ఏకాంతాన్ని 
తిరిగి సాధించాలని 
ఓ చెలీ! నీ పాద ముద్రలనెలా పూజిస్తోందో 
చూడీ సంద్రపు తీరం.
*********
 

4 comments:

  1. ప్రతీసారీ బాగుంది అని పెట్టకుండా...ఏదైనా బాలేదు అని రాద్దమనుకుంటాను కాని ఆ అవకాశం ఇవ్వరుగా:-)


    ReplyDelete
    Replies
    1. పద్మర్పిత గారు మీ అభిమానాత్మక స్పందనకు ధన్యవాదాలు :-) :-)

      Delete