స్వాభిమానమా నీకు జోహార్
వస్తూ నీవిన్ని ఆనంద బాష్పాలను తేలేదే
పోతూ ఇన్ని కన్నీళ్ళనెలా పట్టుకుపోతున్నావు
అందరిలానే ఎదిగావు కాలపు ఒడిలో ఒదిగావు
ఐనా జరగకూడనిది ఏదో జరిగినట్లు ఏమిటా జనసంద్రం
ఏమి పంచావని నువ్వు అందరికీ
ఈ లోకంతో పొసగక నీ అంతరాంతరాలలో
చెలరేగిన తుఫానుని తప్ప
ఏమి చెప్పావని అందరితోనూ నువ్వు
స్వాభిమానానికి మించిన సంపద
ఆ స్వర్గంలోనూ లేదని తప్ప
అందుకే వివాదాలు, సందేహాలు, సయోధ్యలు,సామరస్యాలు
ఎన్నుంటే ఉండనీ నీతో
నువ్వు చరిత్రవయ్యావన్నది మాత్రం వాస్తవం
విజయానికి కూడా వివేచన ఉండాలని
ఆ వివేచనలోనూ జాతి గౌరవం మెరవాలని
నీవన్నది మరువగలవాడెవ్వడు ఈ భారతావనిలో ఓ థాకరే!
అందుకే మా స్వాభిమాన భారతానికి
నీ జీవితమో ఉపనిషత్తు.
*******
ramesh gaaru..chaalaa baavundi.
ReplyDeletevanaja garu dhanyavaadaalu
Deletenice...
ReplyDeleteveena garu dhanyavaadaalu
Delete