Tuesday, November 27, 2012

నాదు మనసు

నాదు మనసు 
గాయపరచే ముళ్ళను తోడుంచుకున్న 
పువ్వు కన్నా 
గాయపడి గుండెకు కన్నీళ్లను ధారవోయు 
నాదు మనసెంతో మృదువైనది గాదే.
*******
చీర 
వాడు మోయలేని అప్పులతో సహా 
వాడిని ఎంత సునాయాసంగా మోసిందో చూడు 
వాడు అల్లిన ఆ నూలుపోగుల చీరె.
********
అద్దం 
భూమి మొత్తాన్ని పట్టి చూపగలిగే 
అద్దమెక్కడ ఉందని అడిగిన గాలికి 
తనపై నీటిబొట్టును చూపింది 
ఆ గరిక.
*******
నాగరికత  
దీపం చీకటిని పోగేయడంతో సమానం 
నాగరికత 
ఆ వినాశనాన్ని పోగేయడం.
********

2 comments:

  1. అద్దం ... చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. స్వాతి శంకర్ గారు నా బ్లాగ్ కు స్వాగతం మరియు మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete