చెలీ! నీకై....
గోదారి మేనంతా తానే కరిగింది ఎన్నెలా
కరిగి ఏరులా పారింది ఆ పండు ఎన్నెల
ఏరులా పారి అందాన మేరువే అయింది ఆ పండు ఎన్నెల
మేరువైన అందాన
జలతారు పరదాల్లా ఆ వెండి మబ్బులు
ఆ వెండి మబ్బుల కింద
ఈ పసిడి గడ్డి దుబ్బుల మాటున వెదుకుతోంది నా మనసు
నీకై ఓ చెలీ!
ఆ నిండు జాబిలిని నీ ముక్కెరగ పొదగాలని.
*********
(బ్లాగ్ వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు)
సంతోషం అలాగే చేర్చండి
ReplyDelete