అడుగులు-అనుబంధాలు
అసలు అడుగులకి అనుబంధాలకు సంబంధం ఎలాటిదోయ్
అనులోమమా? విలోమమా?
అది వేసే అడుగుకు తెలియాలంటావా?
వేయించే మనసుకు తెలియాలంటావా? ఏది చెప్పు
ఎందుకంటే తన వైపుకు పడని అడుగులపై ఆశ కొన్ని మనసులకి
కొలిచే మనసున్న దానిపై ద్యాసుండదు కొన్ని అడుగులకి
ఎలా విప్పాలోయ్ ఈ చిక్కుముడి
అసలు కొంగులు గట్టి బ్రహ్మముడి అంటారు గానీ
ఈ ముడిని విప్పేదెవ్వరు
ఎవరు వివరించినా ఇది విక్రమార్క విజయమే అవుతుందిలే గానీ
ఏతావాతా ప్రతి అనుబంధానికి తెలిసేదేమిటంటే
అడుగులు దూరంగా పోతున్నా దగ్గరగా పడుతున్నా
మనసులు కొన్నిఆ అడుగులకు మడుగులొత్తుతాయని
కొన్ని అడుగులకు తెలిసేదేమిటంటే
అవునన్నా కాదన్నా తమ అడుగుల్లో అడుగులేసి నడిచే
కొన్ని మనసులుంటాయని.
********
No comments:
Post a Comment