మాస్క్
నేను నిజాన్ని ఒప్పుకోలేను
అబద్ధాన్ని హత్తుకోలేను
నా ఊహాశ్వమేధాన్ని ఆపనూలేను
కపటత్వం నా అంతరంగాన్ని ఏలుతుంటే
నలుగురిలో విభూతి నామాలు పెట్టుకుని తిరుగుతూనే
కోరలని, నఖాలను నా ఆలోచనలకు మొలిపించడం మాత్రం మరచిపోను నేను
ఎందుకంటే ఎలాగైనా గెలుపు కావాలి నాకు
అది మిధ్యలోనైనా మీ అందరి మధ్యలోనైనా
ఐనా నాతోనే నాకు పరిచయం గగనమైన ఈ కాలంలో
నలుగురిలో నేనెలా మొలుస్తాను
ఆ నలుగురిపై నేనెలా గెలుస్తాను
అందుకే నాకు నిజం వద్దు
అలాగని అబద్ధంలోనూ జీవించనునేను
నాకిప్పుడు కావాల్సిందల్లా
నాలోని నిజాన్ని మీకు చూపించని
అబద్ధంతో నన్ను నొప్పించని మాస్కొకటే.
*********
అబద్ధమనేదొక మాస్క్ అని బాగా చెప్పారు.
ReplyDeletena blog ku swagatham mariyu mee spandanaku dhanyavaadaalu
Deleteమిధ్యలోనైనా అందరి మద్యలోనైనా.. Every line is very interesting.
ReplyDeletesubha garu dhanyavaadaalu
Delete