Friday, October 19, 2012

సన్మానం

 సన్మానం 
చేసిన సేవను మరువలేక కాబోలు 
కొమ్మ కొమ్మ ఆపి మరీ 
సన్మానిస్తోంది 
 ఆ రాలుతున్న పండుటాకును.
*******
మాటకారి 
మనసులోని అణువణువును 
పలకరించడంలో 
విషాదమంతటి మాటకారి కాదోయ్ 
ఆ ఆనందం.
*******
లయ  
మనసు పగిలిన చప్పుడులో 
ఏ లయుందని కరిగాయో 
నా కళ్ళు.
*******
జాబిలి 
కదలక నాడా బృందావనాన 
ఏ విద్య నేర్చిందో 
నేటికి గానీ అవగతం కాలేదా ఆకాశానికి 
కలువ కలువకు నడుమనున్న 
ఆ జాబిలిని చూసి.
******

10 comments:

  1. మాటకారి చాలా బాగుంది రమేష్ గారూ!...@శ్రీ

    ReplyDelete
  2. చిన్న చిన్న కవితల్లో సర్వం కూర్చేస్తారు.

    ReplyDelete
  3. మీ పదాలు కూడా మంచి లయ లో కదులుతున్నాయండి... అందుకే మమ్మల్ని కూడా కరిగిస్తున్నాయి....

    ReplyDelete
  4. నాకూ నచ్చాయండి

    ReplyDelete