అతిథి
శుభమైనా అశుభమైనా
నీ ఇంటి చివరి అతిథి
వీధి చెత్తకుండీ.
*****
మేఘసందేశం
మేఘసందేశానికి
అడుగుల సవ్వడికి
దూరమై కూర్చుందా పంటచేలు.
*******
సెలయేరు
పరుగెత్తే మేఘాన్ని
ఒడుపుగా పట్టుకోవడం
ఒయ్యారంగా నేర్చుకుందా సెలయేరు.
*******
జీవితం
శోకం పండించిన
నవ్వుల పంటను
ఆ శోకం సాక్షిగానే తుంచేయడమే
జీవితమంటే .
******
చిన్ని కవితలని చక్కగారాసారు.
ReplyDeletethank you padma garu
Deleteపదాలని చక్కగా ఒడుపుగా పట్టుకుందండి మీ కలం....
ReplyDeletewelcome to my blog and thank you
Deleteకాదేది కవితకనర్హం అన్నారు శ్రీ శ్రీ గారు.... చెత్త కుండీ కి కూడా అర్హత ఇచ్చారు మీరు.....బాగుందండి :)
ReplyDeletethanks andi :-)
Delete