చిగురుటాకు
ఆ చిగురుటాకు జననాన్ని
కళ్ళప్పగించి చూస్తూ వనానికంతా వినబడేలా
చప్పట్లు కొడుతున్నాయా పక్షులు
రెక్కలాడిస్తూ .
******
మౌనం
మాటలు పాటలు అన్నీ పోయే
వద్దంటున్నా మౌనమే
మొఖాన రాసిపెట్టి పోతున్నాడా సురీడంటూ
తనలో తానే అనుకుంటోందా వృక్షం
ఎగిరే గువ్వలను చూస్తూ.
*******
ఆకాశం
కరిగి మాయమైన మేఘం కోసం
గుండెలవిసేలా ఉరుముతుంది
ఆకాశం.
******
కల
కడలి అల
మెలకువతో కనే కల
తిరిగి తిరిగి నీ అడుగులు కొలవాలని.
******
Very Nice!... మరీ ముఖ్యంగా...కరిగి మాయమైన మేఘం కోసం
ReplyDeleteగుండెలవిసేలా ఉరుముతుంది
ఆకాశం.
సుభాహాసిని గారు నా బ్లాగ్ కు స్వాగతం మరియు మీ స్పందనకు ధన్యవాదాలు
Deleteఆకాశం లో మంచి భావం .చిగురుటాకు జననానికి పక్షుల చప్పట్లు ఎంత చక్కటి ప్రతిస్పందన.రమేష్ గారు ఇటువంటి భావాలు వ్రాయటం లో మీకు మీరే సాటి.
ReplyDeleteరవి శేఖర్ గారు మీ చక్కటి స్పందనకు ధన్యవాదాలు
Deleteఎందుకో ఒక్కో సారి మీ కవితలలో కొంచెం ఆర్ద్రత
ReplyDeleteకనిపిస్తూ ఉంటుంది.ప్రక్రుతి అంటే ఇష్టమా ?
అహా, అసయ్యం. హీ హి, ఏమిటా ప్రశ్న?
Deleteరాలే ఆకులంటే మీకు ఇష్టమా? :D
Deleteఅవునండి శశి గారు మీ స్పందనకు ధన్యవాదాలు
Deleteకాదు అజ్ఞాత గారు రాలకుండానే ఆకులు లాగే మీ లాటి వారంటే...........:-)
Deleteకడలి అల
ReplyDeleteమెలకువతో కనే కల
తిరిగి తిరిగి నీ అడుగులు కొలవాలని.
ee lines chala adbuthamga unnayandi
వీణ గారు మీ స్పందనకు ధన్యవాదాలు
Deleteచాలా చక్కని భావాలు...
ReplyDeleteశైల బాల గారు నా బ్లాగ్ కు స్వాగతం మరియు మీ స్పందనకు ధన్యవాదాలు
Delete