Wednesday, October 10, 2012

మనసుంటే మార్గం....

మనసుంటే మార్గం....
మనసుంటే మార్గం ఉంటుందని,
ఆ ఎండమావిని కూడా 
అలలెగసి పడుతున్న కడలిగా మార్చి 
నావగా తానెలా సాగిపోతోందో 
చూడా ఎండుటాకు.
********
మనసు తలంపు 
తమను సాగనంపి 
తాను తేలికబడదామనుకున్న 
ఆ మనసు తలంపు 
తేరేది కాదంటున్నాయా కన్నీళ్లు అప్పుడప్పుడు.
********
ఇంద్రధనుస్సు 
కట్టడానికి నారే గనుక ఉండి 
బాణాలు వేయడం మొదలెడితే ఆ ఇంద్రధనుస్సు 
తమకా దేవుడి మెడనలంకరించే 
భాగ్యమెక్కడిదంటున్నాయా పూలు.
*********
రక్త పిపాశులు 
ఇంత రక్త పిపాశులైయుండి కూడా 
చరిత్రలో స్థానం సంపాదించలేక పోయాయేమిటోయ్ 
ఆ దోమలు.
*******

6 comments:

  1. మీ అందమైన ఊహల్ని మరింత అందంగా అందించారు రమేష్ గారు అన్నీ చాలా బాగున్నాయి

    ReplyDelete
  2. అందమైన విశేషణాలతో అలరించారు రమేష్...అభినందనలు..

    ReplyDelete
  3. అన్ని ఆలోచనలు బాగున్నాయి.

    ReplyDelete