భువనవిజయం
తమ రచనలను అందంగా పాడి వినిపించే
జలపాతం, సెలయేరు
పక్షులు, కీచురాళ్ళు
తుమ్మెదలు, తేనెటీగలు
గాలికూగే చెట్లు, నానా మృగాదులనే
అష్టదిగ్గజాలతో నిత్య శోభిత
భువనైక మోహన భువనవిజయమేనోయ్
ఆ అడవి.
***********
ఇంద్రధనుస్సు
మనసులు కలిసి అప్పటికప్పుడే
మనువాడతాయేమోనని ఆ ఎండా వానలు
తాను తాళిబొట్టుగా ప్రత్యక్షమౌతుందా ఇంద్రధనుస్సు.
**********
కావడి
పున్నమి వెన్నెల్లో
సరదాగా కావడి మోయాలనుకున్న ఆ జాబిలికి
కావడి బద్దలా దొరికిందా గోదారి
మరి కుండలంటావేమిటోయ్ ?
రసాస్వాదనాబాష్పాలు రాల్చుతున్న నీ నా కన్నులేనోయ్.
**********
ఆశలచిగురింత
చెమరించిన ఎన్ని నయనాలకు తెలుసు
తమ ఆశల చిగురింతకు
అక్కరకు రావీ కన్నీరని.
*******
అద్భుతంగా ఉంది. ఆనందంగా ఉంది.
ReplyDeleteధన్యవాదములు.
వనజ గారు మీ అమూల్య స్పందనకు ధన్యవాదాలు
Deletebaagunnaayi ramesh gaaroo!
ReplyDeletebhuvana vijayam bhuvanaika manoharamgaa undi...
@sri
sri garu dhanyavaadaalu
Delete