Wednesday, October 3, 2012

వర్షరాగం

వర్షరాగం 
పరిమళ మంత పారవశ్యాన్నే కాదు 
మొలకలెత్తినంత ఆనందాన్నీ 
చూపగలదా మన్ను 
 హర్షాన రవళించిన 
ఆ వర్ష రాగాన్ని వింటూ.
*********
అత్తగారు 
గుభాళించే పువ్వుల్లాటి పిల్లల్ని 
వేలు లక్షలుగా కని కూడా 
ఆ తోట దక్కించుకోలేని అత్తగారన్న గౌరవాన్ని 
ఇద్దరంటే ఇద్దర్నే కని దక్కించుకుందా చెరువు 
సూర్య చంద్రులను అల్లుళ్ళుగా సంపాదించి.
********
'గాలి' తో సావాసం  
'గాలి'తో సావాసం చేసి 
తనలోని భావుకతను 
బయట పెట్టుకుంటే ఆ ఎడారి 
'గాలి'తో చెలిమి చేసి తన వైభోగాన్నే 
పోగొట్టుకుందీ న్యాయం.
*******
వాన పాట 
ఒక్క వాన పాట పాడి 
తన వసంతాన్ని 
శిశిరంగా మార్చుకోగలదా ఆకాశం.
********


6 comments:

  1. Replies
    1. priya garu welcome to my blog and thankyou for you comment

      Delete
  2. భలే తమాషాగా ఉన్నాయి మీ కవితలు
    నానీలు వ్రాయొచ్చు కదా

    ReplyDelete
    Replies
    1. sasikala garu welcome to my blog. thankyou for reading my poetry and i will try

      Delete
  3. చాలా బాగుంది. కవిత్వపు చిరునామా ని చూపుతున్న మీకు అభినందనలు.

    ReplyDelete